ఆగస్ట్లో కార్ల విక్రయాలు 10% అప్: సియామ్ | SIAM sees passenger vehicle sales rising 10-12% on pent-up, festival demand | Sakshi
Sakshi News home page

ఆగస్ట్లో కార్ల విక్రయాలు 10% అప్: సియామ్

Sep 10 2016 1:17 AM | Updated on Sep 4 2017 12:49 PM

ఆగస్ట్లో కార్ల విక్రయాలు 10% అప్: సియామ్

ఆగస్ట్లో కార్ల విక్రయాలు 10% అప్: సియామ్

దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు వరుసగా 14వ నెలలోనూ పెరిగాయి. తాజాగా ఆగస్ట్‌లో వీటి అమ్మకాలు 17 శాతంమేర ఎగశాయి.

న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు వరుసగా 14వ నెలలోనూ పెరిగాయి. తాజాగా ఆగస్ట్‌లో వీటి అమ్మకాలు 17 శాతంమేర ఎగశాయి. దీంతో సియామ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తన వృద్ధి అంచనాలను 10-12 శాతానికి సవరించింది. సియామ్ గణాంకాల ప్రకారం.. ఆగస్ట్‌లో ప్యాసెంజర్ వాహన విక్రయాలు 2,58,722 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి గతేడాది ఇదే నెలలో 2,21,743 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక కార్ల అమ్మకాలు 10 శాతం వృద్ధితో 1,62,360 యూనిట్ల నుంచి 1,77,829 యూనిట్లకు ఎగశాయి. సానుకూల రుతుపవనాలు, ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల అమలు వంటి పలు అంశాలు వాహన విక్రయాల పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయని సియామ్ పేర్కొంది.

మారుతీ సుజుకీ దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు 12 శాతం వృద్ధితో 1,19,906 యూనిట్లకు పెరిగాయి. కార్ల విక్రయాలు 4 శాతం వృద్ధితో 86,454 యూనిట్ల నుంచి 90,269 యూనిట్లకు చేరాయి.

హ్యుందాయ్ ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 7 శాతం వృద్ధితో 43,201 యూనిట్లుగా ఉన్నాయి. దీని కార్ల విక్రయాలు 34,728 యూనిట్లుగా నమోదయ్యాయి.

మహీంద్రా ప్యాసెంజర్ వాహన విక్రయాలు 29 శాతం వృద్ధితో 18,246 యూనిట్లకు చేరాయి.

మొత్తం టూవీలర్ విక్రయాలు 26 శాతం వృద్ధితో 16,48,883 యూనిట్లకు ఎగశాయి.

ప్యాసెంజర్ వాహన విక్రయాల అంచనాలు పెంపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ప్యాసెంజర్ వాహన విక్రయాల వృద్ధి అంచనాలను సియామ్ సవరించింది. సియామ్ తొలిగా ప్యాసెంజర్ వాహన విక్రయాల వృద్ధిని 11-13 శాతం శ్రేణిలో అంచనా వేసింది. తర్వాత ఈ అంచనాలను 6-8 శాతానికి తగ్గించింది. మళ్లీ ఇప్పుడు అంచనాలను 10-12 శాతానికి పెంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement