గ్లోబల్ జోష్‌తో స్టాక్ మార్కెట్ జోరు..

ముంబై : అంతర్జాతీయ అనిశ్చితి తొలగుతుందనే సంకేతాలతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో కీలక సూచీలు ఎగిశాయి. ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా నిరాశాజనకంగా ఉన్నా ట్రేడ్ డీల్ పై ఆశలు, బ్రెగ్జిట్‌పై స్పష్టత వంటి అంశాల ఊతంతో మదుపుదారుల్లో సానుకూల సెంటిమెంట్ నెలకొంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 428 పాయింట్లు లాభపడి 41,009 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 12,086 పాయింట్ల వద్ద క్లోజయింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి