
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరకు భారీ నష్టాల్లో ముగిసాయి. రోజంతా నష్టాల్లో కొనసాగిన కీలక సూచీలు చివరకు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా గరిష్ట స్థాయిల్లో ట్రేడర్ల లాభాల స్వీకరణతో ఆరంభ రికార్డు స్థాయిలను నిలబెట్టుకోలేకపోయాయి. ఫలితంగా సెన్సెక్స్ 416 పాయింట్లు నష్టపోయి 41528 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు క్షీణించి 12224 వద్ద ముగిసింది. రికార్డు గరిష్టం నుంచి సెన్సెక్స్ 743 పాయింట్లు, నిఫ్టీ 206 పాయింట్లు , నిఫ్టీ బ్యాంకు 800 పాయింట్లకు పైగా పతనమైనాయి.
దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 510 పాయింట్లుకుప్పకూలింది. ప్రధానంగా కోటక్ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ భారీ పతనాన్ని నమోదు చేసాయి. పవర్‌గ్రిడ్, భారతి ఎయిర్టెల్, భారతి ఇన్‌ఫ్రాటెల్, గెయిల్, ఐటీసీ స‍్వల్పంగా లాభపడగా, కోటక్‌మహీంద్ర, జీ, ఐవోసీ, రిలయన్స్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ భారీగా నష్టపోయాయి.