షార్ప్ రికవరీ : స్పల్ప నష్టాలు | Sakshi
Sakshi News home page

షార్ప్ రికవరీ : స్పల్ప నష్టాలు

Published Thu, Jun 25 2020 4:09 PM

Sensex, Nifty End Volatile Session Lower - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు  భారీ నష్టాలనుంచి తేరుకుని స్వల్ప నష్టాలతో ముగిసాయి. జూన్ సిరీస్‌ ముగియనున్న నేపథ్యంలో  లాభ నష్టాల మధ్య  తీవ్రంగా ఊగిసలాడిన కీలక సూచీలు చివరి గంటలో పుంజుకుని స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ఒక దశలో 350 పాయింట్లకుపైగా కుప్పకూలిన  సెన్సెక్స్ 27 పాయింట్ల స్పల్ప నష్టంతో 34842 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు నష్టంతో 10288 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ,  ఫార్మా లాభపడ్డాయి.  

ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, ఇండియన్ ఆయిల్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, శ్రీ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్ర నష్టపోయాయి. ఎఫ్‌ఎంసిజి ఇండెక్స్ 2 శాతం పెరిగి టాప్ గెయినర్ గా వుంది. ఐటీసీ టాప్ విన్నర్ గా నిలవగా, సన్ ఫార్మ, నెస్లే, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, గెయిల్ ఇండియా, వేదాంత, హిందూస్తాన్ యూనిలీవర్, సిప్లా, ఐసీఐసీఐబ్యాంక్,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడ్డాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement