లాభాల ప్రారంభం : అమ్మకాల జోరు | Sensex Jumps Over 200 Points Now Lossing Gains | Sakshi
Sakshi News home page

లాభాల ప్రారంభం : అమ్మకాల జోరు

Apr 18 2019 9:52 AM | Updated on Apr 18 2019 9:54 AM

Sensex Jumps Over 200 Points  Now Lossing Gains - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. గత రెండు సెషన్లుగా భారీగా లాభపడిన సూచీలు మహావీర్‌ జయంతి సందర్భంగా నిన్నటి  సెలవు తరువాత గురువారం పాజిటివ్‌గా మొదలయ్యాయి. ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా లాభపడినా అమ్మకాల సెగ తాకింది.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 39356 వద్ద,  నిఫ్టీ 14 పాయింట్లు ఎగిసి 11801 వద్ద కొనసాగుతున్నాయి.  

దేశవ్యాప‍్తంగా వివిధ రాష్ట్రాల్లో రెండవ దశ  ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.  

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈరోజు ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఆసియన్‌ పెయింట్స్‌,  యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో లాభాలతో కొనసాగుతున్నాయి.   అయితే  జెట్‌ ఎయిర్‌వేస్‌ మరోసారి 30శాతం భారీ పతనాన్ని నమోదు చేస్తోంది.  నిఫ్టీ బ్యాంకు నష్టపోతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement