విలయం నుంచి భారీ రికవరీ

Sensex ends 1325 pts up as indices stage sharpest day recovery - Sakshi

సాక్షి, ముంబై:  ప్రపంచ మార్కెట్లలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. 2008 తరువాత మొదటిసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ మార్కెట్లను కుదిపివేస్తోంది. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్‌లో కీలక ప్రధాన సూచికలు శుక్రవారం 10 శాతం పతనం కావడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపి వేశారు. తిరిగి ప్రారంభమైన మార్కెట్లు భారీ రికవరీ సాధించాయి.  కనిష్టంనుంచి ఏకంగా  సెన్సెక్స్‌  5381 పాయింట్లు  నిఫ్టీ 1604 పాయింట్లకు పైగా  ఎగిసింది. 

చివరికి సెన్సెక్స్ 1325 పాయింట్లు ఎగిసి 34,103 వద్ద, నిఫ్టీ 365 పాయింట్లు లాభంతో  9955 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 2.5 శాతం, 0.8 శాతం పెరిగాయి. నిఫ్టీ మీడియా మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంకు 11 శాతం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్‌ ఒక్కొక్కటి 5 శాతం పెరిగాయి. టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, సన్ ఫార్మా, యూపీఎల్, జీ, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, నెస్లే  నష్టపోయాయి. అలాగే అంతకుముందు డాలర్‌తో పోలిస్తే  74.5 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి కూడా భారీగా పుంజుకుని  73.99 వద్ద 0.4 శాతం లాభపడింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top