సెన్సెక్స్ 102 పాయింట్లు అప్ | Sensex ends 102 pts higher; Nifty50 tops 8,700; ONGC rallies 4% | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ 102 పాయింట్లు అప్

Oct 25 2016 1:56 AM | Updated on Sep 4 2017 6:11 PM

సెన్సెక్స్ 102 పాయింట్లు అప్

సెన్సెక్స్ 102 పాయింట్లు అప్

ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్‌కావడంతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 102 పాయింట్లు పెరిగి 28,179 పాయింట్ల వద్ద ముగిసింది.

మూడు వారాల గరిష్ట స్థాయిలో ముగింపు
ముంబై: ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్‌కావడంతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 102 పాయింట్లు పెరిగి 28,179 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్లు ఎగసి 8,709 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీలు ఈ స్థాయిలో ముగియడం మూడు వారాల తర్వాత ఇదే ప్రధమం. ఎన్‌పీఏలపై బ్యాంకుల యాజమాన్యాలతో ఆర్థిక మంత్రి సమావేశం కావడం కూడా సెంటిమెంట్‌ను బలపర్చిందని, అయితే మంగళవారం నుంచి కొన్ని కీలక బ్యాంకులు ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించినట్లు విశ్లేషకులు వివరించారు. దాంతో సూచీల లాభాలు పరిమితంగానే వున్నాయని వారు చెప్పారు.

వెలుగులో ఓఎన్‌జీసీ..
కొన్ని పీఎస్‌యూ షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. బోనస్ షేర్ల జారీకి గురువారం బోర్డు సమావేశం జరపనున్నదనే వార్తలతో ఓఎన్‌జీసీ 4.61 శాతం ఎగిసి రూ. 292 వద్ద ముగిసింది. కోల్ ఇండియా 2.5 శాతంపైగా పెరిగింది. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, లుపిన్, ఎస్‌బీఐలు కూడా 2 శాతం మేర ర్యాలీ జరిపాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement