నష్టాల ముగింపు : బ్యాంక్‌ షేర్ల పతనం

Sensex Closes 95 Points Lower, Nifty Gives Up 10,700; Banking Stocks Lead Declines - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఆరంభంనుంచి స్తబ్దుగా కొనసాగిన మార్కెట్లు చివరికి నష్టాల బాటపట్టాయి.  సెన్సెక్స్‌ 95 పాయింట్లు క్షీణించి 35,227 వద్ద నిలవగా.. నిఫ్టీ 40 పాయింట్లు తక్కువగా 10,696 వద్ద  ముగిసింది.  దీంతో నిప్టీ  నిన్నటి 10700 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది.  ఒక్క ఆటో  తప్ప దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే ముగిశాయి. రియల్టీ, బ్యాంకింగ్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 1.2-0.7 శాతం మేర నష్టపోయాయి.  బజాజ్‌ ఫిన్‌, ఓఎన్‌జీసీ, ఐషర్‌, టాటా స్టీల్‌, గెయిల్‌, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.  దాదాపు 28 స్టాక్స్ 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి.  మరోవైపు బజాజ్‌ ఆటో, డాబర్‌ ఇండియా,గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఫస్ట్ సోర్సు సొల్యూషన్స్, నెస్లే ఇండియా, టెక్ సొల్యూషన్స్ ఎన్ఎస్ఇలో మధ్యాహ్నం  52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మారుతీ, ఎయిర్‌టెల్‌, హీరోమోటో, హిందాల్కో, టాటా మోటార్స్‌, సన్ ఫార్మా, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ, ఆర్‌ఐఎల్‌,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్, గెయిల్ కూడా లాభపడ్డాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top