సెబీ సంచలన నిర‍్ణయం

Sebi allows bourses to extend trading time for equity drivatives till 11.55 pm - Sakshi

సాక్షి, ముంబై: మార్కెట్‌ రెగ్యులేటరీ సెబీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈక్విటీ డెరివేటివ్స్‌  ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించుకునే అనుమతిని మంజూరు చేసింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి  11.55 వరకూ ట్రేడింగ్‌ నిర్వహించుకోవచ్చని శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్న3.30 వరకు ట్రేడింగ్‌ అనుమతి ఉండగా,తాజానిర్ణయంతో మరో ఎనిమిది గంటలకుపాటు  ట్రేడింగ్‌  సమయాన్నిపొడిగించింది.  అంటే దాదాపు రోజంతా ట్రేడింగ్‌ చేసుకునే అవకాశమన్నమాట. ఈ  ఆదేశాలు, 2018, అక్టోబర్‌ 1వ తేదీనుంచి  అమల్లోకి రానున్నాయి.  తాజా నిర్ణయంతో బిఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అక్టోబర్ నుంచి దాదాపు 14 గంటల పాటు డెరివేటివ్స్ ట్రేడింగ్‌ కొనసాగనుంది. ఈమేరకు  జారీ చేసిన ఒక సర్క్యులర్‌ ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలు   సెబీ నుండి ముందుగా అనుమతి  పొందాలి. రిస్క్ మేనేజ్మెంట్, సెటిల్మెంటు ప్రాసెస్‌ తదితర అంశాలకు లోబడి ఈ అనుమతి ఉంటుంది. 

స్టాక్స్, వస్తువుల వ్యాపారాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యను చేపట్టినట్టు  సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)  పేర్కొంది.  ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్లో  అక్టోబరు 1 నుంచి 11.55 గంటలవరకు ఎక్స్ఛేంజ్ వర్తకాన్ని  పొడిగించింది.  ప్రస్తుతం కమోడిటీ మార్కెట్‌ లో ఉదయం 10గంటలనుంచి రాత్రి 11.55నిమిషాల దాకా  ట్రేడింగ్‌ చేసుకునే అవకాశం ఉన్నసంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top