సత్య నాదెళ్ల ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరో తెలుసా? | Satya Nadella reveals his favourite Indian cricketer | Sakshi
Sakshi News home page

సత్య నాదెళ్ల ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరో తెలుసా?

Nov 9 2017 5:29 PM | Updated on Nov 9 2017 7:07 PM

Satya Nadella reveals his favourite Indian cricketer - Sakshi

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు సీఈవో అయిన భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల తనకు తాను క్రికెట్‌ ప్రేమికుడిగా ప్రకటించారు. ఇటీవల తాను లాంచ్‌ చేసిన 'హిట్‌ రీఫ్రెష్‌' లో ఈ విషయాన్ని తెలిపారు. భారత్‌లో క్రికెట్‌ ఎలా ఆడతారో తెలుసుకోవడంతోనే తనకు పోటీపడటం అర్థమైందన్నారు. అదేవిధంగా టైమ్స్‌ ఇండియాతో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా తన అభిమాన భారత క్రికెటర్‌ పేరును కూడా వెల్లడించారు. ఆఫ్‌-స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బెస్ట్‌ ప్లేయర్‌గా అభివర్ణించారు. ఒక్క ఓవర్‌లో భిన్నమైన రీతిలో ఆరు బాల్స్‌ వేసే సత్తా అశ్విన్‌కు ఉందని భావిస్తున్నట్టు తెలిపారు.

ఇండియన్‌ స్కిప్పర్‌ విరాట్‌ కోహ్లి గురించి మాట్లాడిన సత్య నాదేళ్ల, తను ఒక్క స్పెషల్‌ అభివర్ణించారు. కానీ తనకు క్రికెట్‌ చూడటానికి సమయం దొరకడం లేదని, అప్‌డేటెడ్‌ ఉండటానికే తాను కృషిచేస్తున్నట్టు చెప్పారు. టెస్ట్‌ క్రికెట్‌ను తాను ఎంతో ప్రేమిస్తానని తెలిపారు. శక్తి పరంగా, అథ్లెటిక్‌ పరంగా, వృత్తి విధంగా ప్రస్తుత భారత క్రికెట్‌ను ఆయన కొనియాడారు. ఆస్ట్రేలియన్ల మాదిరి భారతీయులు ఆడటం చూడటం చూస్తుండటం చాలా అద్భుతంగా ఉందన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement