రెలిగేర్‌లో 11 అనుబంధ సంస్థల విలీనం | Religare Enterprises board okays merger of 11 subsidiaries | Sakshi
Sakshi News home page

రెలిగేర్‌లో 11 అనుబంధ సంస్థల విలీనం

Dec 28 2016 1:03 AM | Updated on Sep 4 2017 11:44 PM

రెలిగేర్‌లో 11 అనుబంధ సంస్థల విలీనం

రెలిగేర్‌లో 11 అనుబంధ సంస్థల విలీనం

రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌.. తన 11 పూర్తి స్థాయి అనుబంధ కంపెనీలను విలీనం చేసుకోనున్నది. ఈ మేరకు మంగళవారం కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌.. తన 11 పూర్తి స్థాయి అనుబంధ కంపెనీలను విలీనం చేసుకోనున్నది. ఈ మేరకు మంగళవారం కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది. కంపెనీ కార్పొరేట్‌ వ్యవస్థీకరణను సరళీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్కొంది.

విలీనం కానున్న ఆ 11 కంపెనీలు...
రెలిగేర్‌ సెక్యూరిటీస్‌(బ్రోకింగ్‌ బిజి నెస్‌ మినహాయింపు), రెలిగేర్‌ కమోడిటీ బ్రోకింగ్, ఆర్‌జీఏఎమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్, రెలిగేర్‌ వెంచర్‌ క్యాపిటల్, రెలిగేర్‌ ఆర్ట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్, రెలిగేర్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్, ఆర్‌జీఏఎమ్‌ క్యాపిటల్‌ ఇండియా, రెలిగేర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్, రెలిగేర్‌ సపోర్ట్‌ సర్వీసెస్, రెలిగేర్‌ ఆర్ట్స్‌ ఇనీషియేటివ్,  రెలిగేర్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌(ఇండియా) .. ఈ విలీన వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌  షేర్‌ 4.3 శాతం వృద్ధితో రూ.249 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement