అలీబాబా అధినేతను వెనక్కినెట్టి.. | Pony Ma Replaced Jack Ma As Chinese Richest Person | Sakshi
Sakshi News home page

జాక్‌ మా స్ధానంలో పోనీ మా

Jun 25 2020 2:17 PM | Updated on Jun 25 2020 2:18 PM

Pony Ma Replaced Jack Ma As Chinese Richest Person - Sakshi

చైనాలో అత్యంత సంపన్నుడిగా ఎదిగిన పోనీ మా

బీజింగ్‌ : కరోనా మహమ్మారి ప్రభావంతో అత్యంత సంపన్నుల జాబితాలూ తారుమారవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్‌లో టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు అనూహ్యంగా పెరగడం, షాపింగ్‌ యాప్‌ పిండుడువో దూకుడు చైనా బిలియనీర్ల ర్యాంకింగ్‌ను తిరగరాశాయి. అతిపెద్ద గేమ్ డెవలపర్ టెన్సెంట్‌ హోల్డింగ్స్‌ అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌ను అధిగమించి ఆసియాలోనే అత్యంత విలువైన సంస్థగా ఎదిగింది. దీంతో చైనాలో అత్యంత సంపన్నుడు జాక్‌ మా (48 బిలియన్‌ డాలర్లు)ను టెన్సెంట్‌కు చెందిన పోనీ మా (50 బిలియన్‌ డాలర్ల) అధిగమించారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం పిడిడికి చెందిన కోలిన్ హువాంగ్  43 బిలియన్ డాలర్ల నికర సంపదతో టాప్‌ 3 సంపన్నుల్లో మూడవ స్ధానంలో నిలిచారు. చైనా ఎవర్‌గ్రాండే గ్రూపునకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం హుయ్ కా యాన్‌ నాలుగో స్ధానానికి పడిపోయారు. కరోనా మహమ్మారితో వినియోగదారుల అలవాట్లు మారడంతో పలు ఇంటర్‌నెట్‌ కంపెనీల షేర్లు నింగికెగిశాయి. దీంతో చైనా సంపన్నుల ర్యాంకుల్లో టెక్‌ దిగ్గజాలు అనూహ్యంగా దూసుకొచ్చాయి. తొలి టాప్‌ 5 ర్యాంకుల్లో నలుగురు టెక్నాలజీ దిగ్గజాలే కావడం గమనార్హం.

చదవండి : ‘అలీబాబా’ జాక్‌ మా కీలక నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement