పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు | Petrol, Diesel Prices Hiked Yet Again | Sakshi
Sakshi News home page

 పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయ్‌

Feb 21 2019 8:37 AM | Updated on Feb 21 2019 10:17 AM

Petrol, Diesel Prices Hiked Yet Again - Sakshi

సాక్షి ముంబై : ఒకరోజు స్థిరంగా ఉన్న  ఇంధన ధరలు  నేడు (గురువారం) మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. పెట్రోలుపై లీటరు 15పైసలు, డీజిల్‌ పై 16పైసలు చొప్పున ధర పెరిగింది. అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ పైపైకి పోతుండటంతో ఈవారంలో సోమ, మంగళవారాల్లో దేశీయంగా పెట్రోలు ధరలు పెరిగినా,  బుధవారం స్థిరంగా ఉన్నాయి. కానీ ఇవాళ  మళ్లీ పుంజుకున్నాయి. తాజా పెరుగుదలతో దేశంలో వివిధ మెట్రో నగరాల్లో పెట్రోలు , డీజిలు ధరలు ఇలా ఉన్నాయి. 

ఢిల్లీ : లీటరు పెట్రోలు ధర రూ.  71.15,  డీజిల్‌ ధర రూ.66.33
ముంబై:  లీటరు పెట్రోలు ధర రూ.  76.79 డీజిల్‌ ధర రూ.69.47
చెన్నై:  లీటరు పెట్రోలు ధర రూ.  73.87, డీజిల్‌ ధర రూ.70. 09
కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. 73.25, డీజిల్‌ ధర రూ.68.12
హైదరాబాద్ ‌: లీటరు పెట్రోలు ధర రూ.  75.50, డీజిల్‌ ధర రూ.71.12
అమరావతి : లీటరు పెట్రోలు ధర రూ.  75.28, డీజిల్‌ ధర రూ.71.49

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement