అదరగొట్టే ఫీచర్లతో వన్‌ప్లస్ 7 ప్రొ : ప్రీబుకింగ్‌ ఆఫర్‌

OnePlus 7 Pro Pre-Booking Begins on Amazon India - Sakshi

సాక్షి, ముంబై :  చైనా మొబైల్‌ మేకర్‌ వన్‌ప్లస్‌ మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయ బోతోంది.  వన్‌ప్లస్‌ 6 కు సక్సెసర్‌గా  వన్‌ప్లస్‌ 7ను  ఈ నెలలో ఆవిష్కరించనుంది. ఫాస్ట్‌ అండ్‌ స్మూత్‌ ట్యాగ్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది.  ఈ మేరకు వన్‌ప్లస్‌ సీఈవో పీట్‌ లౌ వన్‌ప్లస్‌ 7 టీజర్‌ను విడుదల చేశారు.
 
వన్‌ప్లస్‌ నుంచి వస్తున్న కొత్త ప్రొడక్టును అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఫాస్ట్‌ అండ్‌ స్మూత్‌ పదాలకు కొత్త నిర్వచనం చెబుతుందని, ఇది చాలా అందంగా ఉంటుంది అని ఆయన ట్వీట్‌ చేశారు. ఫైనల్ గా వన్ ప్లస్ 7 ఫోన్ల లాంచింగ్ ను కంపెనీ బెంగుళూరులో మే 14న జరిగే ఈవెంట్లో లాంచ్ చేయనుంది. సీఈఓ విడుదల చేసిన టీజర్‌  వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రో, వన్‌ప్లస్‌ 7 ప్రో 5జీపేరుతో మూడుస్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనుందన్న అంచనాలకు బలాన్నిస్తోంది. 
 
వన్‌ప్లస్‌ 7 ప్రొ ఫీచర్లపై అంచనాలు 
6.7 ఇంచ్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌
3120x1440 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
6/12 జీబీ ర్యామ్, ‌128/256 జీబీ స్టోరేజ్‌,
48+8 ఎంపీ  డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా
16  ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నవారికి కంపెనీ ఓచర్లను అందిస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ఓచర్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనుంది.

అలాగే  మే 4నుంచి వెయ్యి  రూపాయలతో ప్రీ బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉంది.  ఇప్పటికే అమెజాన్‌  ప్రైమ్‌ మెంబర్లకు ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ బుకింగ్‌ ద్వారా 15వేల రూపాయల  స్ర్కీన్‌ రిప్లేస్‌మెంట్‌ సదుపాయం ఆరు నెలలవరకు ఉచితం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top