2015 తర్వాత మొదటిసారి | Nifty50 at 8K for 1st time since 2015 | Sakshi
Sakshi News home page

2015 తర్వాత మొదటిసారి

May 26 2016 1:47 PM | Updated on Sep 4 2017 12:59 AM

2015 నవంబర్ 5 తర్వాత మొదటి సారి నిఫ్టీ 8 వేల మార్క్ ను దాటింది.

ముంబై: గురువారం నాటి  ట్రేడింగ్ లో  దలాల్ స్ట్రీట్  లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.  ఎన్డీఏ సర్కార్  రెండేళ్ల పండుగను   స్టాక్ మార్కెట్లు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు గా కనిపిస్తోంది.  2015 నవంబర్ 5 తర్వాత మొదటి సారి నిఫ్టీ 8 వేల మార్క్ ను దాటింది. 78 పాయింట్ల లాభంతో 8,013 దగ్గర ఉంది. అటు అటు సెన్సెక్స్ కూడా 26 వేల స్థాయిని దాటి ట్రేడ్ అవుతోంది. 296 పాయింట్ల లాభంతో 26,177 దగ్గర ఉంది.  గత 58  సెషన్లలో 7 వేల స్థాయి నుంచి 8 వేల స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు ఆనందంగా ఉన్నారు. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో   దూసుకుపోతున్నాయి.  

ఆయిల్ రంగంలో నెలకొన్న సానుకూల సంకేతాలను నిష్టీ రీబౌండ్ కు సాయం చేశాయని ఎనలిస్టులు అంటున్నారు.అమెరికా  ఫెడ్  రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాల నేపథ్యంలోనే ఈ ర్యాలీ అని, వడ్డీరేట్లు పెరగనున్నాయనే వార్తలో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఈ మూడు రోజుల్లో  4.3శాతం లాభాలతో ఇన్వెస్టర్లను లాభాల  బాట పట్టించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement