
కోవిడ్-19 వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం మార్చి 24న కేంద్రం 21రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. అదేరోజు సెన్సెక్స్ 25,638 వద్ద, నిఫ్టీ 7511 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. నాటి నుంచి సూచీలు రెండు కీలకమైన నిరోధ స్థాయిలను అధిగమించి 30శాతం ర్యాలీ చేశాయి.ఇదే సయంలో బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో 18షేర్లు ఇన్వెసర్లకు రెట్టింపు లాభాల్ని పంచాయి. ఈఐడీ ప్యారీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఐఎఫ్‌సీఐ, కేఆర్‌బీఎల్, అరబిందో ఫార్మా, హెచ్‌ఈజీ, రిలయన్స్ పవర్, వోడాఫోన్ ఐడియాలు ఈ 18షేర్లలో చోటు దక్కించుకున్నాయి.
‘‘వోడాఫోన్ వంటి స్టాక్ ధరలలో భారీగా పతనం జరిగింది. ఓవర్ సోల్డ్ కండిషన్ కారణంగా స్టాక్స్‌లు బౌన్స్‌బ్యాక్‌ను చవిచూశాయి. అలాగే అరబిందో ఫార్మా, గ్లెన్‌మార్క్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ షేర్లు 2018 నుంచి కరెక‌్షన్ చవిచూస్తాయి. ముఖ్యంగా ఫార్మా రంగంలో ఓవర్ సోల్డ్ కండీషన్ ఉండటం, ఈ రంగం రివ్యూయింగ్ ఈ షేర్ల ర్యాలీకి ప్రాథమిక కారణాలుగా పేర్కోనవచ్చు.’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ అభిషేక్ తెలిపారు.
లాక్‌డౌన్‌లో విజేతలుగా నిలిచిన ఈ షేర్లు సమీప భవిష్యత్తులో కూడా ఇదే ప్రదర్శనను కొనసాగిస్తాయనే అనే ప్రశ్నకు నిపుణుల సమాధానం భిన్నంగా ఉంది. కేవలం ఉహాగానాల ద్వారానే స్టాక్స్‌లో ర్యాలీ జరిగింది. కావున కావున ఇన్వెసర్లు లాభాల స్వీకరణ చేసుకోవడం ఉత్తమం అని వారు సలహానిస్తున్నారు.
నిఫ్టీ-50 ఇండెక్స్‌లో 50శాతం లాభపడిన 10 షేర్లు
మార్చి 24నుంచి మొత్తం నిఫ్టీ ఇండెక్స్‌లో 23 షేర్లు 35శాతం లాభపడ్డాయి. ఇదే సమయంలో 10 షేర్లు 50శాతానికి పైగా ఇన్వెస్టర్లకు లాభాలు పంచాయి. ఎంఅండ్‌ఎం, టాటా మోటర్స్, సిప్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్, వేదాంత, జీ ఎంటర్‌టైన్‌మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు 54శాతం నుంచి 75శాతం ర్యాలీచేశాయి.
