
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి తన అధునాతన ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. మొత్తం నాలుగు నూతన ఉత్పత్తులను మంగళవారం విడుదలచేసింది. ‘ఎంఐ టీవీ 4ఎక్స్’ పేరుతో టీవీ సిరీస్‌ను ప్రవేశపెట్టగా.. వీటిలో 65 అంగుళాల టీవీ భారత్‌లోనే ఇప్పటివరకు అతిపెద్ద టీవీగా రికార్డు తిరగరాసింది. దీని ధర రూ. 64,999 కాగా, కార్టెక్స్ ఏ55 ప్రాసెసర్‌తో ఇది లభ్యమవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎంఐ టీవీ 4ఎక్స్ 50 అంగుళాల టీవీ ధర రూ.29,999 (అమెజాన్‌లో లభ్యం), 43 అంగుళాల టీవీ ధర రూ. 24,999 (ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం)గా నిర్ణయించింది. ఇక 40 అంగుళాల పూర్తి హెచ్‌డీ టీవీ ధర రూ. 17,999. అన్ని సైజుల టీవీలు సెపె్టంబర్ 29 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని వివరించింది.
‘ఎంఐ వాటర్ ప్యూరిఫయర్’ విడుదల
ఎఫ్‌డీఏ ఆమోదించిన ముడిపదార్ధాలతో ఉత్పత్తి చేసిన ‘ఎంఐ వాటర్ ప్యూరిఫయర్’ను షావోమీ ప్రవేశపెట్టింది. అత్యంత చిన్న సైజులో ఉండే ఈ ప్యూరిఫయర్‌లో 7–లీటర్ల ట్యాంక్ ఉంది. దీని ధర రూ. 11,999. ‘ఎంఐ బ్యాండ్ 4’ పేరుతో 0.95 అంగుళాల డిస్‌ప్లే ప్యానెల్ కలిగిన వాచ్‌ను విదుదలచేసింది. ‘ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2’ను ఇక్కడి మార్కెట్లోకి తీసుకొచి్చంది.