ఐఫోన్‌కు కలిసి రాని కాలం | iPhone SE could not grab market share | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌కు కలిసి రాని కాలం

Apr 6 2016 3:25 PM | Updated on Sep 3 2017 9:20 PM

ఐఫోన్‌కు కలిసి రాని కాలం

ఐఫోన్‌కు కలిసి రాని కాలం

ఐఫోన్... ఓ బ్రాండ్, ఓ ఇమేజ్ అంటూ వినియోగదారుల మదిలో తెగ ఆశలు కల్పించిన యాపిల్ కంపెనీకి 2016 నిరాశపరుస్తోంది.

ఐఫోన్... ఓ బ్రాండ్, ఓ ఇమేజ్ అంటూ వినియోగదారుల మదిలో తెగ ఆశలు కల్పించిన యాపిల్ కంపెనీకి 2016 నిరాశపరుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఐఫోన్ ఎస్ఈ మోడల్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. గతవారం ఐఫోన్ ఎస్ఈ అమ్మకాలు మొత్తం ఐఫోన్ మోడల్ ఫోన్లలో 0.1 శాతం మాత్రమేనని లోకలిస్టిక్ సర్వేలు వెల్లడించాయి. పాత ఐఫోన్ మోడళ్ల కంటే వీటి అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాయి.

పాత మోడళ్లకు కొన్ని లేటెస్ట్ ఫీచర్లను కలిపిన యాపిల్, ఐఫోన్ ఎస్ఈని 399 డాలర్లతో (రూ.26,557) మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కాని ఆ ఫోన్ విడుదలైనప్పటి నుంచి ఐఫోన్ అమ్మకాలు ఏ మాత్రం పెరగలేదు. ఐఫోన్ 7ఎస్ మోడల్ విడుదల చేసినా కూడా అది ఈ ఫోన్ అమ్మకాలను పెద్దగా కాపాడగలిగే పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement