ఎన్‌హెచ్‌బీ ఆధ్వర్యంలో ఇంటర్‌మీడియరీ

Intermediary With Under NHB - Sakshi

ముంబై: గృహ రుణ సెక్యూరిటైజేషన్‌ మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు చేసింది. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) ఆధ్వర్యంలో ఓ మధ్యవర్తిత్వ (ఇంటర్‌ మీడియరీ) సంస్థను 51 శాతం ప్రభుత్వ వాటాతో ఏర్పాటు చేయాలని సూచించింది. బెయిన్‌ అండ్‌ కో సీనియర్‌ అడ్వైజర్‌ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 29న ఆర్‌బీఐ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను సోమవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌కు సమరి్పంచింది. గృహ రుణాల సెక్యూరిటైజేషన్‌ అంటే... రుణాలను ప్రత్యేక ప్రయోజన విభాగం (ఎస్‌పీవీ)కు బదిలీ చేయడం. ఆ సంస్థ ఆయా రుణాలకు సంబంధించి సెక్యూరిటీలను జారీ చేస్తుంది. వీటిని పాస్‌ త్రూ సరి్టఫికెట్స్‌ (పీటీసీ) అని పిలుస్తారు. ఈ సరి్టఫికెట్లకు అనుసంధానంగా రుణాలు ఉంటాయి. దీనివల్ల రుణాలిచి్చన సంస్థలు, ఆ రుణాలను లిక్విడ్‌ సెక్యూరిటీలు(ట్రేడ్‌ అయ్యేవి)గా మార్చుకోగలవు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top