ఇన్ఫీలో భారీగా ఉద్యోగుల నియామకం | Infosys to hire nearly 20,000 engineers from campuses | Sakshi
Sakshi News home page

ఇన్ఫీలో భారీగా ఉద్యోగుల నియామకం

May 18 2017 11:32 AM | Updated on Sep 5 2017 11:27 AM

ఇన్ఫీలో భారీగా ఉద్యోగుల నియామకం

ఇన్ఫీలో భారీగా ఉద్యోగుల నియామకం

భారీగా ఉద్యోగాల కోత పెడతారంటూ ఓ వైపు ఐటీ ఇండస్ట్రీ నుంచి తీవ్ర ప్రతికూల సంకేతాలు వస్తుండగా.. దేశీయ రెండో అతిపెద్ద ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది.

బెంగళూరు: భారీగా ఉద్యోగాలకు కోత పెడతారంటూ ఓ వైపు ఐటీ ఇండస్ట్రీ నుంచి తీవ్ర ప్రతికూల సంకేతాలు వస్తుండగా.. దేశీయ రెండో అతిపెద్ద ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వార్షికంగా క్యాంపస్ రిక్రూట్ మెంట్ కింద 20వేల మంది ఇంజనీర్లను కంపెనీలోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. అయితే డిజిటల్, అనాలిటిక్స్ లాంటి కొత్త స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే తాము ఎక్కువ ఛాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇటీవల కాలంలో క్లయింట్స్ ఎక్కువగా డిజిటల్, క్లౌడ్, అనాలిటిక్స్ వైపు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని ఇన్ఫీ పేర్కొంది. సెప్టెంబర్ నుంచి వార్షిక క్యాంపస్ నియామకాలు చేపట్టనున్నట్టు ఇన్ఫీ అధికార ప్రతినిధి చెప్పారు. అదేవిధంగా ఎన్ని ఉద్యోగాలు కల్పించనున్నారో కూడా ఆయన ధృవీకరించారు.
 
ఫిబ్రవరి వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్ మెంట్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం నియామకాల పద్ధతిని మార్పు చేస్తున్నామని, విభిన్నమైన స్కిల్స్ ఉన్న హై-వాల్యు గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఆకట్టుకునే అవకాశముందని కూడా ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి తెలిపారు. స్కేల్ వైపు నుంచి స్కిల్ వైపు ఎక్కువగా ఐటీ సర్వీసుల సెక్టార్ ఫోకస్ చేసిందని కంపెనీలు చెబుతున్నాయి. అయితే అంతకముందు ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావముండేది కాదని, చివరేడాదిలోనే ప్లేస్ మెంట్లో 95 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేయని ఆర్ వీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ట్రస్ట్ ఎంకే పాండురంగ శెట్టి చెప్పారు. కానీ వచ్చే ఏడాది మారుతున్న ఇంటస్ట్రి పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు ఎలా మారుతాయో వేచిచూడాల్సి ఉందన్నారు. 10వేల మంది అమెరికన్లకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు గత నెలలోనే ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement