ఇప్పుడు ఇండియన్‌ మోటార్‌సైకిల్‌ వంతు.. | Indian Motorcycle Prices Drop After GST | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ఇండియన్‌ మోటార్‌సైకిల్‌ వంతు..

Jul 8 2017 1:54 AM | Updated on Aug 11 2018 9:10 PM

ఇప్పుడు ఇండియన్‌ మోటార్‌సైకిల్‌ వంతు.. - Sakshi

ఇప్పుడు ఇండియన్‌ మోటార్‌సైకిల్‌ వంతు..

అమెరికాకు చెందిన కల్ట్‌ బైక్‌ బ్రాండ్‌ ‘ఇండియన్‌ మోటార్‌సైకిల్‌’ తాజాగా తన మూడు మోడళ్ల ధరలను రూ.2.21 లక్షల వరకు (9–12 శాతం శ్రేణిలో) తగ్గించింది.

వాహన ధరలు రూ.2.21 లక్షల వరకు తగ్గింపు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన కల్ట్‌ బైక్‌ బ్రాండ్‌ ‘ఇండియన్‌ మోటార్‌సైకిల్‌’ తాజాగా తన మూడు మోడళ్ల ధరలను రూ.2.21 లక్షల వరకు (9–12 శాతం శ్రేణిలో) తగ్గించింది. జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఇండి యన్‌ మోటార్‌సైకిల్‌ బైక్స్‌ను పొలారిస్‌ ఇండియా విక్రయిస్తోంది. ధరల తగ్గింపును పరిశీలిస్తే..

ఇండియన్‌ స్కౌట్‌ మోడల్‌ ధర జీఎస్‌టీకి ముందు రూ.14.75 లక్షలుగా ఉంది. ప్రస్తుతం దీని రేటు 12 శాతం తగ్గింది. ఈ బైక్‌ ఇప్పుడు రూ.12.99 లక్షలకు అందుబాటులో ఉండనుంది.  
ఇండియన్‌ డార్క్‌ హార్స్‌ మోడల్‌ ధర 9 శాతం తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ.21.25 లక్షలుగా ఉండనుంది. ఇదివరకు ఈ బైక్‌ ధర రూ.23.4 లక్షలుగా ఉంది.  
ఇండియన్‌ చీఫ్‌ క్లాసిక్‌ మోడల్‌ ఇప్పుడు రూ.21.99 లక్షలకు అందుబాటులో ఉండనుంది. దీని ధర ఇదివరకు రూ.24.2 లక్షలుగా ఉంది. అంటే ధర 9 శాతం తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement