అలారం మోగి.. హెచ్చరిస్తుంది | How Does a Smart Home Technology System Work | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌ హోం టెక్నాలజీ’లో ముందడుగు

Published Fri, Jan 3 2020 7:37 PM | Last Updated on Fri, Jan 3 2020 7:42 PM

How Does a Smart Home Technology System Work - Sakshi

వీటి ద్వారా ఇంటికి సరైన భద్రత లభించడంతోపాటు విద్యుత్, గ్యాస్‌ లాంటి ఇంధనాల ఖర్చు కలసివస్తోంది.

న్యూఢిల్లీ : ‘స్మార్ట్‌ హోం టెక్నాలజీ’ 2019 సంవత్సరంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ రంగం 2020 సంవత్సరంలో ఎంతో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి సరైన భద్రతను కల్పించడం, ఫ్యాన్లను, లైట్లను ఇంటి నుంచి, ఇంటి వెలుపల నుంచి స్మార్ట్‌ఫోన్ల ద్వారా అన్‌ చేయడం, ఆఫ్‌ చేయడం, ఇంటికి కాలింగ్‌ బెల్‌ను నొక్కుతున్నది ఎవరో? ఇంటి లోపలి నుంచే కాకుండా, ఇంటి వెలుపలి నుంచి కూడా కనుగొనడం, కాలింగ్‌ బెల్‌కు అమర్చిన బెల్లు ద్వారా వారిని చూడడం, ఇంట్లో వంట గ్యాస్‌ ఆఫ్‌ చే శామా, లేదా? బయటి నుంచి కనిపెట్టి స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా కట్టివేయడం తదితర సదుపాయాలన్నీ ‘స్మార్ట్‌ హోం టెక్నాలజీ’ పరిధిలోకి వస్తాయి. వీటి ద్వారా ఇంటికి సరైన భద్రత లభించడంతోపాటు విద్యుత్, గ్యాస్‌ లాంటి ఇంధనాల ఖర్చు కలసివస్తోంది.

స్మార్ట్‌ డోర్‌బెల్‌: 2019లో అభివృద్ధి చేసిన వాటిలో ఇది ఒకటి. బెల్‌కు అమర్చిన కెమేరా ద్వారా బెల్‌ కొట్టిందెవరో చూడవచ్చు. డోర్‌ తీయకుండానే వారితో మాట్లాడి విషయం తెలుసుకోవచ్చు. దీనికో యాప్‌ను కూడా రూపొందించారు. ఈ యాప్‌ ద్వారా ఇంటి వెలుపల ఎక్కడున్నా బిల్‌ కొట్టిన వారిని మన స్మార్ట్‌ఫోన్‌లో చూడవచ్చు. వారితో మాట్లాడవచ్చు.

స్మార్ట్‌ డోర్‌లాక్‌: రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రధాన ద్వారం తలుపులు తెరవచ్చు, మూయవచ్చు. ఇంటి యజమాని ఇంట్లోకి వస్తున్న విషయాన్ని గ్రహించి ఆయన లేదా ఆమె రాగానే తలుపులు తెరచుకొని, మళ్లీ మూసుకునేలా చేయవచ్చు. ఇంట్లోని అన్ని డోర్లకు ఈ టెక్నాలజీ పనికి రాదు. గందరగోళం వల్ల తలుపులు తెరుచుకోవడం, మూసుకునే వ్యవస్థ దెబ్బతినవచ్చు. భవిష్యత్తులో ఈ ఇబ్బందులు తొలగిపోవచ్చు.

స్మార్ట్‌ లైట్‌బల్బ్స్‌: యాప్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌ నుంచి కావాల్సినప్పుడు ఇంట్లోని లైట్లను ఆన్‌ చేయవచ్చు, ఆఫ్‌ చేయవచ్చు. ఊరికి పోయినప్పుడు కూడా ఇంట్లోని లైట్లను రాత్రి పూట ఆన్‌చేసి, తెల్లవారుజామున ఆఫ్‌ చేయవచ్చు. తద్వారా ఇంటివారు ఇంట్లోనే ఉన్నారన్న భ్రమ కలిగించవచ్చు.

స్మార్ట్‌ అలారమ్స్‌ : ఎవరైన తలుపు తెరచినప్పుడు గానీ, కిటికీ తెరచినప్పుడుగానీ అలారం మోగి మనల్ని హెచ్చరిస్తుంది. దీనికి 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌ కూడా ఉంటుంది.

స్మార్ట్‌ థర్మోస్టాట్స్‌: రోజులో ఎప్పుడు, ఎంత ఉష్ణోగ్రత ఉండాలో ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తూ డబ్బు వృధాను అరకట్టే గ్యాడ్జెట్‌. ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంటికి ఎంతో భద్రతను తెచ్చుకున్న విషయం తెల్సిందే. మున్ముందు ఈ ‘స్మార్ట్‌ హోం టెక్నాలజీ’లో ఎన్నెన్ని అద్భుతాలు పుట్టుకొస్తాయో!   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement