ఎస్‌బీఐ కంటే ఆ బ్యాంక్‌ రేట్లే ఎక్కువ! 

HDFC Bank Hikes Deposit Rates By 1 Percent For Select Tenures - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫిక్స్‌డ్‌​ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాలాలకు వడ్డీరేట్లను ఒక శాతం (100 బేసిస్ పాయింట్లు) వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో ఎస్‌బీఐ ఆఫర్‌ చేస్తున్న వడ్డీరేట్ల కంటే కూడా హెచ్‌డీఎఫ్‌సీ ఎఫ్‌డీలపైనే ఎక్కువగా పొందవచ్చు. ఈ పెంపుదలతో రెండేళ్లకు పైన ఉన్న అన్ని మెచ్యూరిటీలపై 7 % వడ్డీని హెచ్‌డీఎఫ్‌సీ అందించనుంది. అంతేకాక ఏడాది కాలానికి వడ్డీరేట్లు 6.75 శాతం నుంచి 6.85 శాతానికి పెరిగాయి.

ఏడాది 17 రోజుల నుంచి 2 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీరేట్లు 6.25 శాతం నుంచి 7 శాతానికి పెంచుతున్నట్టు బ్యాంకు చెప్పింది. దీనివల్ల సీనియర్ సిటిజన్లు, మరెందరో డిపాజిటర్లు దాదాపు 7.5 శాతం లాభాలను ఆర్జించనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7.9 లక్షల కోట్ల డిపాజిట్లతో దేశీయ బ్యాంకు డిపాజిట్లలో 7 శాతం వాటాను కలిగి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్లు కేవలం ఎస్‌బీఐ కంటే ఎ‍క్కువగా ఉండటమే కాకుండా.. ఇతర ప్రైవేట్‌, పబ్లిక్‌ రంగ బ్యాంకుల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇతర బ్యాంకులు కూడా హెచ్‌డీఎఫ్‌సీ బాటలో పయనించే అవకాశం ఉంది. ఇది రుణ రేట్లమీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిట్‌ రేట్లు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top