హెచ్‌సీఎల్‌ టెక్‌లో 15 వేల ఉద్యోగాలు | HCLTechnologies to hire 15000 freshers this year | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఎల్‌ టెక్‌లో 15 వేల ఉద్యోగాలు

Jul 22 2020 2:03 PM | Updated on Jul 22 2020 2:14 PM

HCLTechnologies to hire 15000 freshers this year - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15వేల మంది ఫ్రెషర్ల నియామకాలను చేపట్టనున్నట్టు  ప్రకటించింది. కరోనావైరస్ టెక్ కంపెనీలను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ, బలమైన డిమాండ్, వృద్ధి అంచనాల నేపథ్యంలో ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాల కల్పనకు మొగ్గుచూపుతున్నాయి. ఈ  క్రమంలో హెచ్‌సీఎల్‌ కూడా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లపై దృష్టి పెట్టింది.   

గత ఏడాది 9వేలమందిని ఎంపిక  చేసుకున్న సంస్థ ఈ ఏడాది అదనంగా మరో 6 వేల మందిని చేర్చుకోనుంది. ఇతర టెక్ కంపెనీల మాదిరిగానే, హెచ్‌సీఎల్ కూడా తన నియామకాలను వర్చువల్‌గా  చేపట్టనుంది. అయితే కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా క్యాంపస్‌లలో ప్రెషర్ల ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉందని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సుమారు 1000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్టు తెలిపింది. వృద్ధి, ఖాళీలను పూరించే పక్రియలో భాగంగా ఈ నియామకాలు ఉండనున్నాయి. అయితే  ఈ ఏడాది  కంపెనీని వీడే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని హెచ్‌ఆర్‌ హెడ్‌ వీవీ అప్పారావు తెలిపారు 

కాగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ జూన్ 2020 త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 31.7 శాతం పెరిగి 2,925 కోట్ల రూపాయలను నమోదు చేసింది. కంపెనీ ఆదాయం 8.6 శాతం పెరిగి 17,841 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 16,425 కోట్లు. ఈ త్రైమాసికంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆదాయం ప్రభావితమైనప్పటికీ బలమైన డిమాండ్‌ పరిస్థితులున్నట్టు ఫలితాల సందర్భంగా కంపెనీ సీఈఓ సీ విజయకుమార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement