ఫ్లాట్‌గా బంగారం ధర

Gold prices trade flat - Sakshi

ఈక్విటీల ర్యాలీతో బంగారానికి తగ్గిన డిమాండ్‌ 

రూ.49,055 వద్ద కీలక నిరోధం

అంతర్జాతీయంగానూ అక్కడక్కడే

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో శుక్రవారం బంగారం ధర ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం సెషన్‌లో 10గ్రాముల బంగారం రూ.21ల స్వల్ప లాభంతో రూ.48794.00 వద్ద కదలాడుతుంది. కంపెనీలు అంచనాలకు మించి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తుండంతో ఈక్విటీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దీంతో ట్రేడర్లు బంగారంలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.386లు నష్టపోయి రూ.48,773 వద్ద సిర్థపడింది. ఇది పసడికి వరుసగా రెండోరోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం.  

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 10లక్షలను అధిగమించగా మృతుల సంఖ్య 25వేలను దాటింది. ఈ సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లను విధిస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక రివకరి ఆందోళనలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఆందోళనలే బంగారానికి మద్దతునిస్తాయని బులియన్‌ పండితులు చెబుతున్నారు. రూ. 49,000-49,250 పరిధిలో కీలకమైన నిరోధాన్ని ఎదుర్కోంటుందని, అలాగే రూ.48,700-48,550  శ్రేణిలో బంగారానికి కీలక మద్దతు స్థాయి ఏర్పాటు అయ్యిందని వారు చెబుతున్నారు. 

అంతర్జాతీయంగానూ అక్కడక్కడే: 
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియాలో ఉదయం ఔన్స్‌ బంగారం ధర 2డాలర్లు నష్టపోయి 1788డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. తర్వలోనే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చనే ఆశలు బలపడటంతో పాటు సమీప భవిష్యత్తులో వడ్డీరేట్ల ఉద్దీపన ప్యాకేజీల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సంకేతాలను ఇవ్వడంతో  బంగారం ధరలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. కరోనావైరస్‌ వ్యాప్తి తర్వాత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభాన్ని సమర్థవంతగా ఎదుర్కోనేందుకు ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీలు, తక్కువ వడ్డీరేట్లను ప్రకటించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఏడాది(2020)లో 18శాతం ర్యాలీ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top