స్టార్టప్‌లకు నిధుల సమీకరణ సులభతరం చేస్తూ.. దేశీ స్టాక్ ఎక్స్చేంజీల్లో ఈ తరహా సంస్థల లిస్టింగ్‌కు సంబంధించిన
లిస్టింగ్ నిబంధనలు నోటిఫై చేసిన సెబీ
ముంబై : స్టార్టప్‌లకు నిధుల సమీకరణ సులభతరం చేస్తూ.. దేశీ స్టాక్ ఎక్స్చేంజీల్లో ఈ తరహా సంస్థల లిస్టింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం నోటిఫై చేసింది. ఐటీ, డేటా అనలిటిక్స్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో వస్తున్న స్టార్టప్‌లకు తోడ్పాటు కల్పించేలా.. కీలక వివరాల వెల్లడి సహా డీలిస్టింగ్, టేకోవర్, ప్రచార వ్యయాల పరిమితులు, ప్రమోటర్ల పెట్టుబడికి లాకిన్ వ్యవధి మొదలైన నిబంధనల్లో వెసులుబాటు కల్పించింది.