జినోపోర్ట్ తో రెడ్డీస్ లెసైన్సింగ్ ఒప్పందం | Dr Reddy's, XenoPort sign US licensing agreement | Sakshi
Sakshi News home page

జినోపోర్ట్ తో రెడ్డీస్ లెసైన్సింగ్ ఒప్పందం

Mar 29 2016 1:03 AM | Updated on Sep 3 2017 8:44 PM

జినోపోర్ట్ తో రెడ్డీస్ లెసైన్సింగ్ ఒప్పందం

జినోపోర్ట్ తో రెడ్డీస్ లెసైన్సింగ్ ఒప్పందం

ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బయోఫార్మాస్యూటికల్ కంపెనీ జినోపోర్ట్‌తో లెసైన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బయోఫార్మాస్యూటికల్ కంపెనీ జినోపోర్ట్‌తో లెసైన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా జినోపోర్ట్ తయారు చేసిన క్లినికల్ స్టేజ్‌లో ఉన్న ఎక్స్‌పీ23829 అనే నూతన రసాయన నామం అభివృద్ధితోపాటు యూఎస్ మార్కెట్లో వాణిజ్యీకరణకు రెడ్డీస్‌కు ప్రత్యేక హక్కులు వస్తాయి. సొరియాసిస్ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. అలాగే నరాల సంబంధ చికిత్సల  కోసమూ ఉపయోగపడేలా దీనిని అభివృద్ధి చేయవచ్చని కంపెనీ తెలిపింది. హక్కులను పొందినందుకుగాను డాక్టర్ రెడ్డీస్ రూ.335 కోట్లను జినోపోర్ట్‌కు చెల్లిస్తుంది. నియంత్రణ, వాణిజ్య పరమైన మైలురాళ్లను రెడ్డీస్ అధిగమించినందుకు (భవిష్యత్తులో) రూ.2,935 కోట్ల వరకు జినోపోర్ట్ పొందనుంది. అలాగే అమ్మకాలనుబట్టి రాయల్టీని రెడ్డీస్ చెల్లిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement