హైదరాబాద్‌లో సీజీఎస్‌ నూతన కార్యాలయం

Computer Generated Solutions launches in Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికాకు చెందిన సాంకేతిక రంగ కంపెనీ కంప్యూటర్‌ జనరేటెడ్‌ సొల్యూషన్స్‌ (సీజీఎస్‌) హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిన్నరలో 800 మందికి, ఐదేళ్లలో 2 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈఓ ఫిలిప్‌ ఫ్రైడ్‌మన్‌ తెలిపారు. త్వరలోనే ఈ సెంటర్‌లో సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్‌ సెంటర్‌ (సీఎస్‌ఓఎస్‌)ను కూడా నెలకొల్పుతామని.. ఇందులో ఆగ్యుమేటెడ్‌ రియాలిటీ (ఏఐ) ఆధారిత సేవలందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, సైయంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయిల్‌ రీఫ్‌మన్, సీజీఎస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈఓ ఫిలిప్‌ ఫ్రైడ్‌మన్, సీజీఎస్‌ ఇండియా ఎండీ జీతు భట్టు గురువారం సీజీఎస్‌ హైదరాబాద్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సెంటర్‌ నుంచి మా కస్టమర్లకు ఆర్‌ అండ్‌ డీ, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్, కస్టమర్‌కేర్‌ సెంటర్‌ సేవలను అందిస్తున్నామని, మైక్రో సాఫ్ట్, ఐబీఎం, డెల్, ఏటీఅండ్‌టీ, అవయ, తోషిబా, రెమాండ్స్‌ వంటి కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోని టాప్‌ టెక్నాలజీ కంపెనీ కాల్‌సెంటర్‌ను ఈ సెంటర్‌ నుంచే నిర్వహిస్తున్నామని చెప్పారు. సీజీఎస్‌ గ్లోబల్‌కు యూఎ స్, యూకే, కెనడా, ఇజ్రాయిల్, రొమానియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కార్యాలయాలున్నాయి. 45 దేశాల్లో ఫ్యాషన్, అపెరల్, ఈ– కామర్స్, హెల్త్‌కేర్, రిటైల్‌ వంటి పరిశ్రమలకు ఎంటర్‌ప్రైజెస్‌ సొల్యూ షన్స్‌ను అందిస్తుంది. ప్రస్తు తం 8 వేల మంది ఉద్యోగులన్నారని.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 వేల మందికి చేరుకుంటామని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top