సీబీఐ అదుపులో గీతాంజలి కీలక అధికారి

 CBI detains Gitanjali Group vice-president Vipul Chitalia at Mumbai airport - Sakshi

సాక్షి ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు మరో కీలక  వ్యక్తిని అదుపులోకి  తీసుకున్నారు.  గీతాంజలి గ్రూప్‌లో బ్యాంకింగ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విపుల్‌ చితాలియాను మంగళవారం సీబీఐ  ప్రశ్నిస్తోంది.

పీఎన్‌బీ మెగా స్కాంకు సంబంధించి  బ్యాంకాక్‌నుంచి  ముంబై విమానాశ్రయం చేరుకున్న విపుల్‌ను  అదుపులోకి తీసుకున్న అధికారులు  నేరుగా సీబీఐ ఆఫీసుకు వెళ్లి అక్కడ ప్రశ్నిస్తున్నారు. దాదాపు రూ.13వేల కోట్ల భారీ మోసంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీతో పాటు అతడి మామ గీతాంజలి గ్రూప్‌ అధినేత మెహుల్‌ చోక్సీలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మోదీ, మెహెల్‌  విదేశాలకుచెక్కేశారు.దీంతో రెండు కంపెనీలకు చెందిన కీలక ఉద్యోగులతో , పీఎన్‌బీ బ్యాంకు  పలువురు  సీనియర్‌ అధికారులను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇది ఇలా ఉంటే  ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌,  యాక్సిస్‌ బ్యాంకు ఎండీ శిఖా శర్మకు సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌(ఎస్‌ఎఫ్‌ఐఓ) సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top