ఎన్‌ఈసీ గ్యాస్ బ్లాక్‌లో విక్రయానికి నికో వాటాలు

ఎన్‌ఈసీ గ్యాస్ బ్లాక్‌లో విక్రయానికి నికో వాటాలు


న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న నికో రిసోర్సెస్ .. ఎన్‌ఈసీ-25 గ్యాస్ బ్లాక్ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఇందులో తనకున్న 10 శాతం వాటాలను భాగస్వామ్య సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీకి విక్రయించనున్నట్లు 2016 రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపింది. ఎన్‌ఈసీ-25 బ్లాక్‌లో 60% వాటాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన ఆపరేటర్‌గా ఉంది. బీపీకి 30%, నికో రిసోర్సెస్‌కు 10% వాటాలున్నాయి. ఒడిషాలో తీరానికి దగ్గర్లోని ఎన్‌ఈసీ-25 బ్లాక్‌లో సుమారు 1.032 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఆర్థిక కష్టాల్లో ఉన్న నికో.. సమస్యల నుంచి గట్టెక్కేందుకు కేజీ-డీ6 చమురు, గ్యాస్ క్షేత్రంలో కూడా తనకున్న వాటాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top