జోరుగా వాహన విక్రయాలు.. | Car sales zoom 21% in September | Sakshi
Sakshi News home page

జోరుగా వాహన విక్రయాలు..

Oct 8 2016 1:24 AM | Updated on Sep 4 2017 4:32 PM

జోరుగా వాహన విక్రయాలు..

జోరుగా వాహన విక్రయాలు..

దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు సెప్టెంబర్‌లో 20 శాతం మేర ఎగశాయి. గత నాలుగున్నరేళ్లలో ఈ స్థాయి అమ్మకాలు నమోదుకావడం ఇదే తొలిసారి.

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు సెప్టెంబర్‌లో 20 శాతం మేర ఎగశాయి. గత నాలుగున్నరేళ్లలో ఈ స్థాయి అమ్మకాలు నమోదుకావడం ఇదే తొలిసారి. దీనికి యుటిలిటీ వాహన విక్రయాల పెరుగుదల, కొత్త మోడళ్లు, పండుగ సీజన్ వంటి అంశాలు బాగా అనుకూలించాయి. సియామ్ గణాంకాల ప్రకా రం.. పీవీ విక్రయాలు సెప్టెంబర్‌లో 2,78,428 యూనిట్లుగా నమోదయ్యాయి.

గతేడాది ఇదే నెలలో పీవీ అమ్మకాలు 2,32,170 యూనిట్లుగా ఉన్నాయి. కాగా 2012 మార్చిలో పీవీ విక్రయా లు 2,95,403 యూనిట్లుగా నమోద య్యాయి. యుటిలిటీ వాహన అమ్మకాలు సెప్టెంబర్‌లో 48,467 యూనిట్ల నుంచి 38 శాతం వృద్ధితో 66,851 యూనిట్లకు ఎగశాయి. కార్ల విక్రయాలు 15 శాతం వృద్ధితో 1,69,590 యూనిట్ల నుంచి 1,95,259 యూనిట్లకు చేరాయి.

Advertisement
 
Advertisement
Advertisement