న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరుమీదుంది. జూన్ నెలలో ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదయ్యింది. అటుఇటుగా గత పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సమాఖ్య (సియామ్) తాజా గణాంకాల ప్రకారం..
♦ దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) అమ్మకాలు 1,99,036 యూనిట్ల నుంచి 2,73,759 యూనిట్లకు పెరిగాయి. 2009 డిసెంబర్ నాటి 50 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి.
♦ దేశీ కార్ల విక్రయాలు 34.21 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,37,012 యూనిట్ల నుంచి 1,83,885 యూనిట్లకు పెరిగాయి.
♦ ‘జీఎస్టీ అమలు నేపథ్యంలో ధరల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రజలు గతేడాది ఇదే నెలలో కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీనివల్ల ప్రస్తుతం వృద్ధి రేటు పెరిగింది’ అని సియా మ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ తెలిపారు.
♦ యుటిలిటీ వెహికల్స్, వ్యాన్ల విక్రయాల్లో వరుసగా 47.11 శాతం, 35.64 శాతం వృద్ధి నమోదయ్యింది.
♦ మారుతీ సుజుకీ దేశీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 44.4 శాతం వృద్ధితో 1,34,036 యూనిట్లకు, హ్యుందాయ్ మోటార్ విక్రయాలు 20.79 శాతం వృద్ధితో 45,371 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 11.89 శాతం వృద్ధితో 18,092 యూనిట్లకు, టాటా మోటార్స్ పీవీ అమ్మకాలు 56.75 శాతం వృద్ధితో 20,610 యూనిట్లకు ఎగశాయి.
♦ మొత్తం టూవీలర్ విక్రయాల్లో 22.28 శాతం వృద్ధి నమోదయ్యింది. 18,67,884 యూనిట్లకు పెరిగాయి.
♦ మోటార్ సైకిల్ అమ్మకాలు 24.32 శాతం వృద్ధితో 11,99,332 యూనిట్లకు ఎగశాయి. హీరో మోటొకార్ప్ దేశీ మోటార్ సైకిల్ విక్రయాలు 16.56 శాతం పెరిగాయి. 6,26,194 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా మోటార్ సైకిల్ అమ్మకాలు 19.89 శాతం వృద్ధితో 1,74,276 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో విక్రయాలు ఏకంగా 85.87 శాతం వృద్ధితో 2,00,949 యూనిట్లకు ఎగశాయి.
♦ స్కూటర్ విక్రయాలు 20.96 శాతం వృద్ధితో 6,01,761 యూనిట్లకు చేరాయి. హోండా మోటార్‌సైకిల్ దేశీ స్కూటర్ అమ్మకాలు 33.29 శాతం వృద్ధి చెందాయి. 3,61,236 యూనిట్లుగా నమోదయ్యాయి. టీవీఎస్ మోటార్స్ విక్రయాలు 14.84 శాతం వృద్ధితో 99,107 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్ స్కూటర్ అమ్మకాలు 15.53 శాతం క్షీణతతో 63,755 యూనిట్లకు తగ్గాయి.
♦ వాణిజ్య వాహన అమ్మకాలు 41.72 శాతం వృద్ధితో 80,624 యూనిట్లకు ఎగశాయి.
రోడ్లపై కార్ల జోరు!
Published Wed, Jul 11 2018 12:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement