బీఎస్-3 ఎఫెక్ట్ : డిస్కౌంట్లతో స్టాకంతా ఖతం | BS-III impact: Rebates, freebies help 2-wheeler makers clear inventory | Sakshi
Sakshi News home page

బీఎస్-3 ఎఫెక్ట్ : డిస్కౌంట్లతో స్టాకంతా ఖతం

Apr 1 2017 5:45 PM | Updated on Sep 2 2018 5:28 PM

బీఎస్-3 ఎఫెక్ట్ : డిస్కౌంట్లతో స్టాకంతా ఖతం - Sakshi

బీఎస్-3 ఎఫెక్ట్ : డిస్కౌంట్లతో స్టాకంతా ఖతం

దీపావళి ఫెస్టివల్ టూ-వీలర్స్ కంపెనీలకు కాస్త కాదు, చాలా ముందుగానే వచ్చింది.

న్యూఢిల్లీ : దీపావళి ఫెస్టివల్ టూ-వీలర్స్ కంపెనీలకు కాస్త కాదు, చాలా ముందుగానే వచ్చింది. దీపావళికి ప్రకటించే డిస్కౌంట్ ఆఫర్లతో ఆటో షోరూంలన్నీ కళకళలాడుతాయి. కానీ సుప్రీంకోర్టు బీఎస్-3 వాహనాల బ్యాన్ ఎఫెక్ట్ తో దీవాళి సరదా అంతా ఇప్పుడే కనిపించింది. బీఎస్-3 వాహనాలను నేటి నుంచి(ఏప్రిల్ 1) బ్యాన్ చేయబోతున్నట్టు సుప్రీంకోర్టు మూడు రోజుల క్రితం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం ముగింపుకు ఇంకో మూడు రోజులు ముగుస్తుందనగా సుప్రీం ఈ తీర్పు చెప్పడంతో చివరి రెండు రోజుల్లో భారీ డిస్కౌంట్ ఆఫర్లతో కంపెనీలు వినియోగదారులు ముందుకు వచ్చాయి. అసలు  ఇన్వెంటరీని ఎలా సేల్ చేసుకోవాలా? అనే కంపెనీల ఆందోళనలను పట్టాపంచలు చేస్తూ టూవీలర్స్ స్టాక్ అంతా ఒక్కసారిగా అమ్ముడుపోయింది. బీఎస్-3 నియమాలు కలిగిన వెహికిల్స్ పై టూవీలర్ దిగ్గజం హోండా మోటార్ కార్పొరేషన్ 20-40 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసి, రూ.10,000 నుంచి రూ.22,500 మధ్యలో ధర తగ్గింపును ఇచ్చింది.
 
దీంతో మెట్రోస్ ముంబాయి, ఢిల్లీ, బెంగళూరులలో తమ షాపుల్లో స్టాకంతా అయిపోయినట్టు కంపెనీ చెప్పింది.  మార్చి 31 వరకు అన్ని బీఎస్-3 వాహనాలను అమ్మినట్టు హీరో చైర్మన్ పవన్ ముంజల్ కూడా తెలిపారు. ఇలా హీరో, హోండా కంపెనీలే కాదు, అన్ని టూ-వీలర్స్ కంపెనీలు దాదాపు బీఎస్-3 వాహనాలను పండుగ సీజన్ లో సేల్ చేసుకున్న మాదిరిగా అమ్మేసుకున్నాయట. దీనిలో బెస్ట్ సెల్లింగ్ వెహికిల్ గా యాక్టివా స్కూటర్ నిలిచింది. గురువారం డిస్కౌంట్లు ప్రకటించిన అనంతరం అర్బన్ మార్కెట్ల నుంచి స్ట్రాంగ్ డిమాండ్ వచ్చినట్టు కంపెనీలు పేర్కొన్నాయి.  కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ రోజు సాయంత్రం కల్లా స్టాకంతా ఖతం అయినట్టు తెలిపాయి. టూ-వీలర్స్ ఇండస్ట్రి 90-95శాతం స్టాక్ ను లిక్విడిటీగా మార్చుకున్నట్టు తెలిసింది.  మిగిలిపోయిన వెహికిల్స్ ను ఇతర దేశాలకి తరలించడం లేదా బీఎస్-4లోకి మార్చుకోవడం చేయనున్నట్టు వీఈ కమర్షియల్ వెహికిల్స్ సీఈవో వినోద్ అగర్వాల్ చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement