బుక్‌మైషో చేతికి ఎన్‌ఫ్యూజన్‌ | Bookmyshow Enforce the hand | Sakshi
Sakshi News home page

బుక్‌మైషో చేతికి ఎన్‌ఫ్యూజన్‌

Aug 2 2017 12:53 AM | Updated on Sep 5 2018 1:38 PM

బుక్‌మైషో చేతికి ఎన్‌ఫ్యూజన్‌ - Sakshi

బుక్‌మైషో చేతికి ఎన్‌ఫ్యూజన్‌

వీడియో–ఆన్‌–డిమాండ్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్వహిస్తున్న ఎన్‌ఫ్యూజన్‌ను కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టికెటింగ్‌ కంపెనీ బుక్‌మైషో వెల్లడించింది.

న్యూఢిల్లీ: వీడియో–ఆన్‌–డిమాండ్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్వహిస్తున్న ఎన్‌ఫ్యూజన్‌ను కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టికెటింగ్‌ కంపెనీ బుక్‌మైషో వెల్లడించింది. పూర్తిగా నగదుతో ఈ లావాదేవీ జరిగినప్పటికీ, ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందీ బుక్‌మైషో వెల్లడించలేదు. ఎన్‌ఫ్యూజన్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని, తమ ఆన్‌లైన్‌ ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం జ్యూక్‌బాక్స్‌ ద్వారా ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్‌ను విస్తృతం చేస్తామని బుక్‌మైషో డైరెక్టర్‌ పరీక్షిత్‌ దర్‌ చెప్పారు. సోహిబ్‌ జీఎం ఖాన్, శివగురునాథన్, ప్రభాకర్‌రెడ్డిలు 2009లో ప్రారంభించిన ఎన్‌ఫ్యూజన్‌...ఆన్‌లైన్‌ ద్వారా వీడియోలు స్ట్రీమ్‌ చేసుకునే సేవల్ని అందిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement