నాణ్యత వల్లే భారతి సిమెంట్‌కు ఆదరణ | bharathi cement populor reason for best qulity | Sakshi
Sakshi News home page

నాణ్యత వల్లే భారతి సిమెంట్‌కు ఆదరణ

Feb 3 2017 12:54 AM | Updated on Sep 5 2017 2:44 AM

నాణ్యత వల్లే భారతి సిమెంట్‌కు ఆదరణ

నాణ్యత వల్లే భారతి సిమెంట్‌కు ఆదరణ

నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల భారతి సిమెంట్‌కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని భారతి సిమెంట్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి అన్నారు.

సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి వ్యాఖ్య  
సిద్దిపేట రూరల్‌: నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల భారతి సిమెంట్‌కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని భారతి సిమెంట్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో తాపీమేస్త్రీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ భారతి సిమెంట్‌..బహుళజాతి సంస్థ వికాట్‌ భాగస్వామ్యంతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దక్షిణాదిలోనే భారతి సిమెంట్‌ నంబర్‌ వన్‌ కంపెనీగా ఉందన్నారు. కంపెనీ తరఫున తాపీ మేస్త్రీలకు రూ. లక్ష ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు మేస్త్రీలు మాట్లాడుతూ భారతి సిమెంట్‌ నాణ్యతలు పాటించడం వల్ల వినియోగదారులు వాటినే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అందుకే తక్కువ కాలంలోనే భారతి సిమెంట్‌కు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement