మార్కెట్లోకి ‘పల్సర్‌ 125 నియాన్‌’ బైక్‌

Bajaj Launch New pulsar 125 Neon in Market - Sakshi

ప్రారంభ ధర రూ.64,000

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్‌ ఆటో తాజాగా ‘పల్సర్‌ 125 నియాన్‌’ బైక్‌ను మార్కెట్లోకి విడుదలచేసింది. ఈ మోడల్‌లో డ్రమ్‌ బ్రేక్‌ వెర్షన్‌ ధర రూ.64,998 (ఎక్స్‌షోరూమ్‌ – ఢిల్లీ) కాగా, డిస్క్‌ బ్రేక్‌ ఆప్షన్‌ ధర రూ.66,618 ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. రెండు వేరియంట్లలోనూ 125సీసీ ఇంజిన్‌ అమర్చింది. గేర్‌లో ఉన్నప్పుడు కూడా స్టార్ట్‌ అయ్యే విధంగా రూపొందించిన ఈ బైక్‌కు 5–స్పీడ్‌ గ్రేర్‌బాక్స్‌ ఉన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బజాజ్‌ ఆటో మోటార్‌ సైకిల్‌ విభాగ ప్రెసిడెంట్‌ సారంగ్‌ కనడే మాట్లాడుతూ.. ‘స్పోర్టీ మోడల్‌ను ఇష్టపడే వారికోసం రూపొందించిన అధునాతన బైక్‌ ఇది. స్టైల్, పనితీరు పరంగా ఇట్టే ఆకట్టుకునే ఈ బైక్‌ను తక్కువ ధరకే అందిస్తున్నాం’ అని అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top