తప్పుడు ప్రకటనలపై కంపెనీలకు ఏఎస్‌సీఐ అక్షింతలు | ASCI upholds 116 complaints against misleading advertisements | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రకటనలపై కంపెనీలకు ఏఎస్‌సీఐ అక్షింతలు

Oct 17 2017 1:38 AM | Updated on Oct 17 2017 10:40 AM

ASCI upholds 116 complaints against misleading advertisements

న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనలపై అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి (ఏఎస్‌సీఐ) జులైలో 165 పైచిలుకు ఫిర్యాదులు అందాయి. వీటిలో 116 ప్రకటనల విషయంలో ఆయా సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని ఏఎస్‌సీఐ నిర్ధారించింది. ఇందులో ఐటీసీ, గోద్రెజ్‌ కన్సూ్యమర్, హెచ్‌యూఎల్, ఎయిర్‌టెల్‌ వంటి పెద్ద కంపెనీల యాడ్స్‌ కూడా ఉన్నాయి.

‘క్లాస్‌మేట్‌’ బ్రాండ్‌ నోట్‌బుక్‌లో రాస్తే గుండ్రని రాతకు టీచర్‌ 2 మార్కులు ఎక్కువ ఇస్తారనే ఐటీసీ యాడ్‌ని తప్పు పడుతూ.. రాతకు.. నోట్‌బుక్కుకు సంబంధం లేదని సాధారణ నోట్‌బుక్‌ పేపరుపై కూడా అందంగా రాయొచ్చని ఏఎస్‌సీఐ వ్యాఖ్యానించింది.

అలాగే త్రిఫల, ఆమ్ల, బిభీతకి మూలికల మేళవింపుతో తయారు చేసిన క్లినిక్‌ ప్లస్‌ ఉత్పత్తి జుట్టుకు బలాన్నిస్తుందన్న హిందుస్తాన్‌ యూనిలీవర్‌ ప్రకటనను కూడా ఆక్షేపించింది. జుట్టు బలానికి, త్రిఫలకి ముడిపెట్టడం తప్పుదోవ పట్టించేదేనని పేర్కొంది. ’’భారతదేశపు అత్యంత ఇంధన పొదుపు గ్రీన్‌ ఇన్వర్టర్‌ ఏసీ’’ అన్న గోద్రెజ్‌ ప్రకటన కూడా తప్పుదోవ పట్టించేదిగానే ఉందని కౌన్సిల్‌ తప్పుబట్టింది.  



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement