డేటా లీక్‌లపై స్పందించిన వాట్సాప్‌

Amid Breach Scandal, WhatsApp Says It Collects Very Little Data - Sakshi

వాషింగ్టన్‌ : ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ డేటా లీకేజీల వివాదంపై స్పందించింది. మెసేజ్‌లను ట్రాక్‌ చేస్తున్నట్టు వస్తున్న రిపోర్టులను వాట్సాప్‌ కొట్టిపారేసింది. చాలా తక్కువ మొత్తంలో డేటాను మాత్రమే కలెక్ట్‌ చేశామని, కానీ ప్రతి మెసేజ్‌ ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌గా వాట్సాప్‌ పేర్కొంది. భారత్‌లో 200 మిలియన్‌ యాక్టివ్‌ యూజర్లు కలిగి ఉన్న ఈ వాట్సాప్‌ సెక్యూర్‌ కాదంటూ పలువురు విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేశారు. యూజర్‌ ఒప్పందాలపై కొన్ని నియమాలపై ప్రశ్నలు సంధించారు. అయితే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపే మెసేజ్‌లను తాము ట్రాక్‌  చేయడం లేదని, చాలా తక్కువ మొత్తంలో డేటాను మాత్రమే తాము సేకరించామని, కానీ ప్రతి మెసేజ్‌ ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌గా వాట్సాప్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 

యూజర్ల గోప్యత, భద్రత తమకెంతో ముఖ్యమని చెప్పారు. ఇటీవల ఫేస్‌బుక్‌ డేటా, కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు లీక్‌ అయ్యిందనే ఆరోపణలతో వాట్సాప్‌ యూజర్ల డేటా లీక్‌పై కూడా పలు రిపోర్టులు వచ్చాయి. కేంబ్రిడ్జ్‌  అనలిటికా స్కాండల్‌ అనంతరం విమర్శకుల నుంచి వాట్సాప్‌ కూడా పలు విమర్శలు పొందింది. దీనికి గల ప్రధాన కారణం ఈ పాపులర్‌ మెసేజింగ్‌ ప్లాట్‌పామ్‌ను 2014లో ఫేస్‌బుక్‌ సొంతం చేసుకోవడమే. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసే పోస్టింగ్స్‌ కంటే కూడా వాట్సాప్‌లోని గ్రూప్‌ చాట్‌ ఫీచరే యూజర్లకు అతిపెద్ద ముప్పు అని టాప్‌ అమెరికన్‌ టెక్నాలజీ ఎంటర్‌ప్రిన్యూర్‌ వివేక్‌ వాద్వా కూడా వాదిస్తున్నారు. గ్రూప్‌ చాట్‌ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌ ఫోన్‌ నెంబర్లు బయటికి వస్తాయన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top