భారత టెకీలకు అమెరికా షాక్‌

America Shocking Decision On Indian Techies - Sakshi

అమెరికా: డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత టెకీలకు షాకిచ్చింది. తాజాగా యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ సిటిజన్‌ పాలసీ(యూఎస్‌సీఐఎస్‌)ప్రకారం హెచ్‌-1బీ దరఖాస్తులు 2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019లో మూడురేట్లు తగ్గాయని తెలిపింది. వీటిలో భారతీయుల దరఖాస్తులే 70శాతం తిరస్కరణకు గురవడం గమనార్హం. ఇందులో కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారివే ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని ఎన్‌ఎఫ్‌ఏపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండర్సన్‌ అన్నారు. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు కూడా ప్రధాన కారణమని తెలిపారు. టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ కంపెనీకి చెందిన 60శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యానని, తరువాతి స్థానంలో విప్రో, ఇన్ఫోసిస్‌ ఉన్నాయని అన్నారు. 

2018లో భారత్‌కు చెందిన ఆరు ప్రధానమైన సంస్థలలో 2,145 మందికి మాత్రమే హెచ్‌-1బీ వీసాలు వచ్చాయి. ఇక, అమెరికాకు చెందిన అమెజాన్‌ సంస్థలో పనిచేసే విదేశీ ఉద్యోగుల కోసం ఏకంగా 2,399 హెచ్‌-1బీ వీసాలు రావడం గమనార్హం. ఇక, విదేశీ ఉద్యోగుల విషయంలో ఆపిల్‌, వాల్‌మార్ట్‌, కమ్మిన్స్‌ లాంటి కంపెనీల వీసాల మంజూరులో పెద్దగా ప్రభావం లేదని ఎన్‌ఎఫ్‌పీఏ పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రభుత్వం విదేశీ వలసదారులైన భార్యాభర్తలకు ఉద్యోగాలు చేసుకునే సౌలభ్యం కల్పించిన విషయం విదితమే. అమెరికన్లకే ఉద్యోగాల అనే నినాదంతో అధికారం కేవసం చేసుకున్న ట్రంప్‌ ఇప్పుడు వీసా నిబందనలు కఠినతరం చేశారు. దీంతో అమెరికాలో వీసాలు లభించడం ఇప్పుడు చాలా కష్టతరమైంది. 2015లో ఒబామా ప్రభుత్వం అత్యధికంగా భారతీయ మహిళలకు 1,20,000 వీసాలు కల్పించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top