గ్రహం అనుగ్రహం  (29-06-2020)

Daily Horoscope Telugu 29-06-2020 - Sakshi

శ్రీ శార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.నవమి రా.9.45 వరకు, తదుపరి దశమి నక్షత్రం హస్త ఉ.7.30 వరకు, తదుపరి చిత్త వర్జ్యం ప.2.55 నుంచి 4.24 వరకు, దుర్ముహూర్తం ప.12.25 నుంచి 1.18 వరకు, తదుపరి ప.3.02 నుంచి 3.55 వరకు, అమృతఘడియలు... రా.11.38 నుంచి 12.45 వరకు, 
రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం 5,32
సూర్యాస్తమయం 6.34

గ్రహఫలం....

మేషం: రాబడి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో అవరోధాలు. మానసిక అశాంతి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేయాల్సివస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు ముందుకు సాగవు. 

కర్కాటకం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. అనుకోని సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి ఉంటుంది.

సింహం: బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. 

కన్య: ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. పనుల్లో పురోగతి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి.

తుల: ఆదాయం తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. బంధువులతోతగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

వృశ్చికం: కొత్త పరిచయాలు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు.  ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. దేవాలయ దర్శనాలు.

ధనుస్సు: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల మరింత దగ్గరవుతారు. ఆసక్తికరమైన సమాచారం. దూరప్రయాణాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. 

మకరం: కుటుంబసభ్యులతో వైరం. ప్రయాణాలు వాయిదా. కృషి ఫలించదు. బంధువుల నుంచి విమర్శలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దేవాలయ దర్శనాలు. 

కుంభం: స్నేహితులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. మానసిక అశాంతి. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మీనం: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top