గ్రహం అనుగ్రహం (17-07-2019)

Daily Horoscope in Telugu 17-07-2019 - Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, తిథి బ.పాడ్యమి రా.3.11 వరకు, తదుపరి విదియ నక్షత్రం ఉత్తరాషాఢ రా.10.27 వరకు,  తదుపరి శ్రవణం ట, వర్జ్యం రా.2.46 నుంచి 4.30 వరకు, దుర్ముహూర్తం ప.11.37 నుంచి 12.30 వరకు,అమృతఘడియలు..ప.3.33 నుంచి 5.12 వరకు.

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. యత్నకార్యసిద్ధి. అరుదైన పురస్కారాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృషభం: ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. పనులు కొన్ని ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

మిథునం: పనులలో ఆటంకాలు. ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించండి. ఆర్థికంగా కొంత ఇబ్బంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అయోమయ పరిస్థితి.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. పనులు అనుకున్న విధంగా పూర్తి. గౌరవమర్యాదలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మరింత సానుకూలం.

సింహం: వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి  శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

కన్య: కొత్త పనులు ప్రారంభం. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. కళాకారులకు సన్మానాలు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

తుల: విద్యార్థులకు శ్రమాధిక్యం.  ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. దైవచింతన.

వృశ్చికం: విందువినోదాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. తీర్థయాత్రలు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. సోదరుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

ధనుస్సు: సోదరుల నుంచి ఒత్తిళ్లు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మకరం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మీనం: బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాల సందర్శనం. వాహనయోగం. వ్యాపారాలు, ఉధ్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి.

– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top