గ్రహం అనుగ్రహం (14-07-2019) | Daily Horoscope In Telugu 14-07-2019 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (14-07-2019)

Jul 14 2019 7:55 AM | Updated on Jul 14 2019 8:02 AM

Daily Horoscope In Telugu 14-07-2019 - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.త్రయోదశి రా.1.11 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం జ్యేష్ఠ సా.6.43 వరకు, తదుపరి మూల, వర్జ్యం రా.2.57 నుంచి 4.36 వరకు, దుర్ముహూర్తం సా.4.47 నుంచి 5.40 వరకు, అమృతఘడియలు... ఉ.9.49 నుంచి 11.04 వరకు.

సూర్యోదయం        :  5.36
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం          :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం         :  ప.12.00 నుంచి 1.30 వరకు 

భవిష్యం
మేషం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. బం«ధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి కీలక సందేశం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలో ప్రతిష్ఠంభన తొలగుతుంది.

మిథునం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. 

సింహం: ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయణాలు కొంత మార్పులు. ఆధ్యాత్మికS చింతన. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలలో కొంతమేర ఒత్తిడులు.

కన్య: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వస్త్ర, వస్తులాభాలు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు.

తుల: బంధువులతో మాటపట్టింపులు. ప్రయాణాలు చివరిలో  వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. 

వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: బంధువులతో విభేదాలు.  ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో పనిభారం. విద్యార్థులకు గందరగోళం.  

మకరం: చేపట్టిన పనుల్లో విజయం. శుభవర్తమానాలు. ఆప్తుల నుంచి  ఆహ్వానాలు రాగలవు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు. దైవదర్శనాలు చేసుకుంటారు.

మీనం: కుటుంబసభ్యులతో కొద్దిపాటి విభేదాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారులకు విదేశీ పర్యటనలు. అనారోగ్యం. 
– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement