గ్రహం అనుగ్రహం (13-07-2019) | Daily Horoscope in Telugu 13-07-2019 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (13-07-2019)

Jul 13 2019 7:12 AM | Updated on Jul 13 2019 8:13 AM

Daily Horoscope in Telugu 13-07-2019 - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మఋతువు, ఆషాఢమాసం, తిథి శు.ద్వాదశి రా.1.33 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం అనూరాధ సా.6.30 వరకు తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం రా.12.07 నుంచి 1.44 వరకుదుర్ముహూర్తం ఉ.5.35 నుంచి 7.20 వరకుఅమృతఘడియలు... ఉ.8.10 నుంచి 9.44 వరకు.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ఉ. 9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: దూరప్రయాణాలు. బంధువిరోధాలు. బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమ తప్పదు.

వృషభం: అనుకున్న విధంగా ధనప్రాప్తి. కాంట్రాక్టర్లకు కలిసివచ్చే కాలం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: కొన్ని పనులు విజయవంతంగా ముగిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. అంచనాలు నిజమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొంత ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: వ్యవహారాలలో  స్వల్ప ఆటంకాలు. బందువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య: ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సా«ధిస్తారు.  దైవదర్శనాలు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. మిత్రులతో అకారణంగా వివాదాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. అందరిలోనూ గుర్తింపు.

ధనుస్సు: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

మకరం: కొత్త పనులు ప్రారంభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. వాహన,గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరం.

కుంభం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మీనం: కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. బంధువులతో  ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement