కాలినడకన తిరుమల చేరుకున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

YV Reddy Reached Tirumala On Foot And Takes Charge As TTD Chairman - Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి కాలినడకన తిరుమలకు శనివారం ఉదయం చేరుకున్నారు. దైవదర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. హిందూ సంప్రదాయాలను కాపాడుతూ.. భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతన ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా పాలకమండలి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీక్షలు చేపడతామన్నారు. బంగారం వివాదాన్ని నిగ్గుతేల్చుతామని స్పష్టం చేశారు. ప్రధాన అర్చకుల తొలగింపు నిర్ణయాన్ని పునః సమీక్షిస్తామని వెల్లడించారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

చదవండిటీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top