వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం | ysrcp SC cell state secretary | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం

Mar 25 2014 4:38 AM | Updated on Sep 15 2018 3:07 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రుద్రంపేట పురుషోత్తంను నియమిస్తూ ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లాసూర్యప్రకాష్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రుద్రంపేట పురుషోత్తంను నియమిస్తూ ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లాసూర్యప్రకాష్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక పత్రాలను ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి తన నివాసంలో పురుషోత్తంకు అందజేశారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని కోరారు.

మునిసిపల్, పంచాయితీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో దళితులలో చైతన్యం తీసుకురావాలన్నారు. దళితభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. రుద్రంపేట పురుషోత్తం మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర పదవి రావడానికి కారణమైన ఎమ్మెల్యే సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డి, యువజన నేత యోగీశ్వర్ రెడ్డి, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. 

కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్,  వైఎస్సార్ సీపీ నాయకులు పోరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మారుతీనాయుడు, విజయ్, నాయు డు, సుధాకర్, కృష్ణారెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement