
డీఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ నాయకులు
అనంతపురం సెంట్రల్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఆపరేషన్ గరుడ పేరుతో ముందే చెప్పిన సినీ నటుడు శివాజీపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్‌ను ఆయన చాంబర్‌లో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు గోవిందరాజులు, దాదాఖలందర్, ఈశ్వరప్ప తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సినీనటుడు శివాజీ ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని మీడియా ద్వారా ప్రచారం చేశారన్నారు. తరువాత కొద్దిరోజులకే విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగిందన్నారు. ప్రతిపక్షనేతపై దాడి జరుగుతుందని శివాజీకి ముందే ఎలా తెలుసునని ప్రశ్నించారు. ఈ హత్యాయత్నం కేసులో శివాజీతో పాటు మరికొంతమంది పెద్ద స్థాయి నాయకుల పాత్ర ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. శివాజీపై రాజద్రోహం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.