అనంతపురం జిల్లా బెళుగుప్పలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు.
అనంతపురం జిల్లా బెళుగుప్పలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ బుధవారంవ ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే మంగళవారం రాత్రి నుంచే పట్టణంలో 144వ సెక్షన్ విధించడంతో పాఉట.. 25 మంది వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ ఉదయం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, ఎల్ ఎం మోహన్ రెడ్డిలను అరెస్టుచేశారు. ధర్నా కోసం వేసిన శిబిరాన్ని సైతం తొలగించారు. ఈ ధర్నాలో పార్టీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా, విశ్వేశ్వర రెడ్డి పాల్గొనాల్సి ఉంది. మరో వైపు టీడీపీ ఏర్పాటు చేసిన ధర్నా శిబిరాన్ని కూడా పోలీసులు తీసేశారు. పట్టణంలోకి వచ్చే రహదారులను మూసివేశారు.