
'టీడీపీ బడ్జెట్ మేడిపండులా ఉంది'
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మేడిపండులా ఉందని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు.
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మేడిపండులా ఉందని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడిన పార్థసారధి.. ఈ బడ్జెట్ తో ప్రజలకు మేలు చేకూర్చడం మాట అటుంచితే, వారిని మరింత మభ్య పెట్టేదిగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీల గురించి అసెంబ్లీలో మాట్లాడుతుంటే.. ప్రతిపక్షంపై అధికార పార్టీ సభ్యులు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు.
కేంద్రపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సూచించారు. ఈ బడ్డెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు.