వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు వాయిదా | ysr congress party protest post[oned due to Cyclone Hudhud | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు వాయిదా

Oct 12 2014 9:38 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు వాయిదా - Sakshi

వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న చేపట్టాలనుకున్న నిరనస కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దుర్మార్గాలకు నిరనసగా ఈ నెల 16న చేపట్టాలనుకున్న నిరనస కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈమేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హుదూద్ తుఫాన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

తీరప్రాంతాల్లో తుఫాన్ సృష్టించిన విలయంపై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement