'జగన్‌ ప్రజాసంక్షేమ పాలన కొనసాగిస్తున్నారు'

YS Jaganmohan Reddy 100 Days Ruling Celebrations Done At Andhra University - Sakshi

బి. కాంతారావు

సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రా యునివర్సిటీలో విద్యార్థి విబాగం ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు బి. కాంతారావు ఆధ్వర్యంలో జగన్‌ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలో డ్రాపవుట్స్‌ తగ్గడానికి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అమ్మ ఒడి పథకం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. వంద రోజుల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించి జగన్‌ చరిత్ర సృష్టించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సాహోసోపేత నిర్ణయాలతో ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు పూర్తి స్థాయి రీయింబర్స్‌మెంట్‌ను కల్పిస్తూ ఎంతో మేలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బి. మోహన్‌బాబు, ఎం. కళ్యాణ్‌, బి. జోగారావు, కె. దీరజ్‌, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top